
ఎవరికి వారే… యమునా తీరే
కమలంలో అందరూ అంతేనా సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో బీజేపీ ఇద్దరు కేంద్రమంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడితో.. గతానికి ఇప్పటికి బలంగా ఉన్నాం..లీడర్లు పార్టీని పరుగులు పెట్టిస్తారని భావించింది క్యాడర్. అయితే తామొకటి తలిస్తే..కీలక నేతలు మరొకటి చేస్తున్నారని క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారట.తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లలో ఒకరిద్దరు తప్ప అందరూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారే. వీరంతా కలిసికట్టుగా పనిచేసిన, వ్యక్తిగతంగా పనిచేసిన ప్రజలను తమ వైపు ఆకర్శించదగ్గ నేతలే. కానీ ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసినా పార్టీలో గ్రూపు తగాదాలు సమిసిపోయాయన్న ప్రచారం జరుగుతుంది.అంటే నేతల మధ్య గ్యాప్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని క్యాడర్ గుస్సా మీదున్నట్లు తెలుస్తోంది. ఉన్న…
