
మా కొద్దు.. ఎంపీ..
సిరా న్యూస్,విజయవాడ; అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలను స్థాన చలనం తప్పదని ఇప్పటికే సంకేతాలు జారీ చేసిన వైసీపీ అధిష్ఠాం వారిలో కొందరిని పార్లమెంటుకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. అయితే వారి నుంచి మాత్రం ఎటువంటి అంగీకారం కనిపించడం లేదని తెలుస్తోంది. ఫలానా స్థానం నుంచి మీరు ఎంపీగా పోటీచేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండండి అంటే బాబోయ్ ఎంపీగా పోటీనా.. మావల్లకాదండీ అంటూ ఏదోలా సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారట పలువురు ఎమ్మెల్యేలు..దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు స్థానం కాగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కనిపిస్తోందట. ఎవ్వరిని వెళ్లమన్నా ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఆశావహులు ఎవ్వరిని ఎంపీగా పోటీచేయాలని అధిష్ఠానం సూచించినా మావల్ల కాదులేండి అంటున్నారట.ఉమ్మడి…
