
మీరేందుకు భయపడుతున్నారు
తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తే నేనే పాల్గొంటా.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిరా న్యూస్,కరీంనగర్; పరేడ్ గ్రౌండ్ విమోచనోత్సవాలకు సీఎం రావాలి. నిజాం పాలన నుండి విముక్తి కల్పించిన పటేల్ మాకు ముమ్మాటికీ హీరోనే మేం ఆయన వారసులమే నని ఎంపి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. . కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉంది కదా.. ఢిల్లీ సీఎం పదవిచ్చేందుకు రాజీనామా చేశారేమో నని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఎందుకు ఉత్సవాలు నిర్వహించడం లేదు? పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరు.…
