తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తే నేనే పాల్గొంటా..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
సిరా న్యూస్,కరీంనగర్;
పరేడ్ గ్రౌండ్ విమోచనోత్సవాలకు సీఎం రావాలి. నిజాం పాలన నుండి విముక్తి కల్పించిన పటేల్ మాకు ముమ్మాటికీ హీరోనే మేం ఆయన వారసులమే నని ఎంపి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.
6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. .
కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉంది కదా.. ఢిల్లీ సీఎం పదవిచ్చేందుకు రాజీనామా చేశారేమో నని
బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఎందుకు ఉత్సవాలు నిర్వహించడం లేదు? పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నరు. అందుకే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్ కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం, పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతా. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా నిర్వహిస్తున్న, తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. ఏమన్నారంటే.
విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవ లేకుండా నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నా. హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీతో చర్చించి ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. హిందువుల పండుగలపై వివక్ష చూపుతున్నారనే భావన హిందువుల్లో నెలకొంది. ఆ భావనను తొలగించేలా ప్రభుత్వం వ్యవహరించాలి. భగవన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందులో భాగంగానే కరీంనగర్ లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని వారు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది.
రేపు నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను విస్త్రతంగా నిర్వహించాలని కోరుతున్నానని అన్నారు.