చెరువులో నీళ్లు లేవు అన్నారు

చెరువులో నీళ్లు లేకుంటే రైతులు పంటలు ఎలా వేశారు…

టిడిపి నాయకులు…

సిరా న్యూస్,నందవరం;
మండల పరిధిలోని మాచాపురం గ్రామం వైయస్సార్ నాయకులకు మతిస్థిమితం లేదని టిడిపి నాయకులు అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ టిడిపి ఉప అధ్యక్షులు దేవ సహాయం మాజీ ఎంపిటిసి శ్రీనివాసులు మాభాష మాట్లాడుతూ గ్రామ వైయస్సార్ నాయకులు చెరువులో నీళ్లు లేవు అన్నారు మరి చెరువు దగ్గరికి వస్తే మేము చెరువులో ఉండే నీళ్లను మీకు మేము చూపిస్తామని అన్నారు చెరువులో నీళ్లు లేకుంటే చెరువు ఘరానా 100 ఎకరాల నుంచి 120 ఎకరాలు దాకా వరి నాటలు ఎలా వేస్తారని టిడిపి నాయకులు విమర్శించారు గత ప్రభుత్వంలోనే అంటే మీ ప్రభుత్వంలోనే గత సంవత్సరాలలో వర్షాలు బాగా కురవడంతో నీళ్లు ఎక్కువగా ఆగడం ద్వారా పంట పొలాలు నీటిలో మునిగి పోవడంతో చిలకలదోన గ్రామానికి చెందిన ఒక రైతు కోర్టును ఆశ్రయించడం జరిగింది చిలకలదోన గురురాఘవేంద్ర ప్రాజెక్టు కడగొమ్మను ఎత్తు ఎక్కువగా ఉండటంతో నా పొలం మొత్తం నాశనం అయిపోయిందని అందువలన కడగమ్మను ఒక అడుగు తగ్గించడానికి కోర్టు ఆశ్రయించాడు అప్పుడు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది అధికారులు ఏ ఈ, డి ఈ, కడగొమ్మను దగ్గరుండి పగలగొట్టడం జరిగింది అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి మీరు ఎందుకు ఆ పని నిలబెట్టే లేక పోయినారు 2023 సంవత్సరంలో చేతికి వచ్చిన పంటను చాలామంది రైతులు పంటను కోయడం జరిగింది అప్పుడు మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా 2022లో తుంగభద్ర నది జలాశయం నీళ్లు కిందికి వృధాగా పోతుంటే మీరు ఎందుకు చెరువు నింపు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలలు కూడా కాలేదు ఎమ్మెల్యే బి వి జయ నాగేశ్వర్ రెడ్డి మాజీ సర్పంచ్ కాసింవలి సహకారంతో ఎల్ ఎల్ సి నీళ్లు వారం రోజులుగా చెరువులోకి నీళ్లు పారించడం జరిగింది చెరువులో నీళ్లు లేనిదే రైతులు పంటలు ఎలా వేస్తారు మీకు చెరువులోకి నీళ్లు కనపడకుంటే మేము మీకు దగ్గర నుంచి నీళ్లు చూపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుభాష్,తేజేశ్వర నాయుడు, రత్నం, భూపతి, చిన్న రాజు,మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *