
ఉద్యోగులకు యోగా శిక్షణ
యోగాతో సార్వత్రిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం.. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సిరా న్యూస్,కరీంనగర్ ప్ర; ఉత్సాహంగా జిల్లాస్థాయి యోగా పోటీలు అలసటను దూరం చేస్తూ మానసిక దృఢత్వాన్ని అందిస్తూ, నిత్య నూతన ఉత్సాహాన్నిచ్చే యోగలో జిల్లాలోని ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శిక్షణ వచ్చే నూతన సంవత్సరం నుండి నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా క్రీడలు యువజన శాఖ, యోగా అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి ఆహ్వానిత యోగాసనా పోటీల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అయిన యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని నేటి సమాజంలో వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో…
