ఉద్యోగులకు యోగా శిక్షణ

యోగాతో సార్వత్రిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం..

కరీంనగర్ కలెక్టర్ పమేలా
సత్పతి

సిరా న్యూస్,కరీంనగర్ ప్ర;

ఉత్సాహంగా జిల్లాస్థాయి యోగా పోటీలు
అలసటను దూరం చేస్తూ మానసిక దృఢత్వాన్ని అందిస్తూ, నిత్య నూతన ఉత్సాహాన్నిచ్చే యోగలో జిల్లాలోని ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శిక్షణ వచ్చే నూతన సంవత్సరం నుండి నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
జిల్లా క్రీడలు యువజన శాఖ, యోగా అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి ఆహ్వానిత యోగాసనా పోటీల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అయిన యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని నేటి సమాజంలో వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం,యోగా చేయడం తప్పనిసరి అన్నారు. తనకు యోగా అంటే అమిత అభిమానమని అవకాశం ఉంటే క్రీడాకారిణీగా, కనీసం జట్టుకు మేనేజర్ గానైనా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని ఉందని అభిలాషించారు.30 ఏళ్ళ వయసు వచ్చేవరకు జీవితంలో ఏమి చేయాలేదో, ఏమి చేయలో యోగా చెబుతుందన్నారు.
పాఠశాలలు, ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకుడదని, యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు.
చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు చూస్తే ఆనందం, గర్వంగా ఉందన్నారు. వీరిలో ఎముకలు , కండరాలు ఉన్నాయా అనే సందేహంతో రబ్బర్ బాండ్ లా సాగుతూ చేసిన యోగాసనాలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనం అన్నారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయిలో జిల్లాకు చెందిన దీపక్ కు స్వర్ణ పథకం సాధించిన స్ఫూర్తితో జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలన్నారు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ నవ్వడం కూడా యోగాలో ఒక భాగమని తెలిపారు, కరోనా సమయంలో యోగా చేయడం వలన చాలామంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నారని మరో అతిథి అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్ అన్నారు.
జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఎక్కువ పోటీల్లో పాల్గొంటే తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో యోగా అభివృద్ధికై విశేషంగా కృషి చేస్తున్న కలెక్టర్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్వర్ణ పతక విజేత దీపక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి సుధాకర్, జిల్లా క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ కుమార్ నెహ్రు యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ ప్రధాన కార్యదర్శి ఎన్. సిద్ధారెడ్డి, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. జనార్దన్ రెడ్డి, కోచ్ లు వి కిష్టయ్య రామకృష్ణ, మల్లేశ్వరి, ఉప్పాల శ్రీనివాస్ ఆనంద్ కిషోర్ బి సుష్మ ప్రశాంత్ కోటేశ్వరరావు ప్రవీణ వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మయ్య శ్రీనివాస్ నారాయణ ఉపాధ్యాయులు సహ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 300 మంది ఉద్యోగస్తులు క్రీడాకారులు 8-17, 17-21, 21-30, 30-50, 50+ వయసు విభాగాపు పోటీల్లో పాల్గొన్నారు. సమావేశానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ పోటీలో విజేతలకు కలెక్టర్ జ్ఞాపికలతో పాటు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
ఆకట్టుకున్న కలెక్టర్ తల్లి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ మాతృమూర్తి ప్రవ మయి ఆచార్య యోగ పై ఉన్న మక్కువతో ఓ సాధారణ క్రీడాకారిణిగా పోటీలో పాల్గొంది. నిత్యం తాను వేస్తున్న ఆసనాలను పోటీల సందర్భంగా తనలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదిక దొరికిందని అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్వితీయ ప్రతిభ కనబరుస్తూ ఏకంగా రజత పతకాన్ని కైవసం చేసుకోవడమేగాక తన కూతురు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేతుల మీదుగా జ్ఞాపిక తీసుకోవడం సర్వత్ర ఆకట్టుకుంది. ఇది తమ జీవితంలో మరుపురాని ఘట్టమంటూ ఇరువురు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *