టిడిపి సీనియర్ నేత మంచూరి సూర్యనారాయణ రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాన లక్ష్యం అని బద్వేల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గపు సీనియర్ నాయకుడు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ లో ఆయన నివాసంలో లో దీపం 2 పథకం కార్యక్రమం పైఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేసే దీపం 2 కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది చేపింఛన్ వారి వారి ఇండ్ల వద్దకే ఉదయం 6 గంటలకేవెళ్లి పంపిణీ చేపిస్తున్నామన్నారు. బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త రితిష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి సుమారు 14 కోట్లు రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని అలాగే అట్లూరు మండలానికి కూడా సుమా రెండు కోట్ల రూపాయల నిధులు సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ పంపిణీ ప్రతి మహిళకు వరం లాంటిది అన్నారు. ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ ను ఉపయోగించుకోవడం వల్ల కాలుష్య నివారణతో పాటు ప్రతి మహిళకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే మెరుగైన పథకాలన్నిటిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు.