
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
సిరా న్యూస్,కమాన్ పూర్; యువత విద్యార్థులు చెడు అలవాటులకు దూరంగా ఉండాలని షీ టీం ఇన్చార్జి స్నేహలత అన్నారు.గురువారం రామగుండం సి.పి ఆదేశాల మేరకు, పాలకుర్తి మండలం లోని కుక్కలాగూడూరు జడ్పీఎస్ఎస్ హై స్కూల్ విద్యార్థలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి…
