యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

సిరా న్యూస్,కమాన్ పూర్;
యువత విద్యార్థులు చెడు అలవాటులకు దూరంగా ఉండాలని షీ టీం ఇన్చార్జి స్నేహలత అన్నారు.గురువారం రామగుండం సి.పి ఆదేశాల మేరకు, పాలకుర్తి మండలం లోని కుక్కలాగూడూరు జడ్పీఎస్ఎస్ హై స్కూల్ విద్యార్థలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. మరియు ఆకతాయిల నుండి ఎలా రక్షణగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షి టీం సభ్యుడు సురేష్ మరియు ఇంచార్జ్ హెడ్ మాస్టర్ సురేందర్ , ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *