సిరా న్యూస్,రాజమండ్రి;
తండ్రి గెలుపు కోసం తనయ విస్తృత ప్రచారం చేపడుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తరఫున ఆయన కుమార్తె కంఠమనేని శిరీష విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరించి గోరంట్ల గెలుపుకు సహకరించాలని ఓటర్ల అభ్యర్థిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ లోని బొగ్గులు దిబ ఏరియాలో ఆమె ప్రచారం చేపట్టారు.