చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు

వైఎస్ జగన్
సిరా న్యూస్,బోబ్బిలి;
బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ జరిగింది. జగన్ మట్లాడుతూ నా తండ్రి వైఎస్ గాల్లోనే కలిసిపోతాడని.. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటలు నేను మర్చిపోను. నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక.. చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనం. జగన్ను చంపేస్తే తప్పేంటని చంద్రబాబు అంటున్నాడు. బాబు అనుకుంటే జగన్ చనిపోడు. జగన్ను ప్రజలే రక్షించుకుంటారు.. దేవుడు రక్షించుకుంటాడు. చంద్రబాబు మానసిక స్థితిపై అందరూ ఆలోచన చేయాలి. బాబు మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉందో ఆలోచన చేయండి. వెన్నుపోట్లు, మనుషులను చంపడమే చంద్రబాబు రాజకీయం.
ఎన్టీఆర్, వంగవీటి రంగాలను కుట్రలతో చంపింది ఎవరు..? ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావును కుట్రలతో చంపింది ఎవరు..? చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు ఎవరైనా నమ్మగలరా అని ప్రశ్నించారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *