రక్త దానం గొప్ప దార్శనికత

మంత్రి పొన్నం
సిరా న్యూస్,హైదరాబాద్;
రాజ్ భవన్ & ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 20 వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హల్ లో బ్లడ్ డోనేషన్ క్యాంప్ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డోనేషన్ క్యాంప్ ను ప్రారంభించారు. తరువాత బ్లడ్ డో నెట్ చేసిన దాతలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ ,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఎఎస్,రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ,హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్తూ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆర్వీ కర్ణన్,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సీఈఓ మధన్ మోహన్ రావు తదితరులు. పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. రక్త దానం గొప్ప కార్యక్రమం. మన శరీరం నుండి రక్తదానం ఇవ్వడం గొప్ప దార్శనికత. రక్త దానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ విడాలి. పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ అవగాహన కలుగుతుందని అన్నారు.
మూడు నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వచ్చు అని అందరికీ తెలిసిపోయింది. ఒక్కొక్కరు 50,60 సార్లు రక్త దానం చేయడం గొప్ప నిర్ణయం వారికి మరింత మంచి జరుగుతుంది. విద్యార్థి దశ లో ఉన్నప్పటి నుండి ప్రత్యేకమైన రోజుల్లో రక్తదానం చేసేది . రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లు పరిమితంగా ఉన్నాయి. కొత్త జిల్లాలు పెరిగాయి, రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్ కి ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేలా చూస్తే ఇబ్బందులు ఉండవు. దాని వల్ల అవగాహన పెరిగి దాతలు ఎక్కువగా వస్తుంటారు. ప్రభుత్వం తరుపున ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ముఖ్యమంత్రి తో మాట్లాడి ప్రతి జిల్లా హాస్పిటల్ లు 100 బెడ్స్ హాస్పిటల్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పడేలా మాట్లాడతా. రెడ్ క్రాస్ వాహనాలకు రవాణా శాఖ తరుపున వారికి పన్నులు మినహాయింపు ఇవ్వదమా అనేది నిర్ణయం తీసుకుంటాం. తలసేమియా వ్యాధి గ్రస్తులకు బస్ పాస్ అడుగుతున్నారు..చర్చిస్తాం. రక్త దానం గొప్ప కార్యక్రమం..ప్రపంచ రక్త దానం దినోత్సవం సదర్భంగా ఈ కార్యక్రమం లో పాల్గొనడం శుభపరిణామం. అరుదుగా దొరికే బ్లడ్ దొరికే వారి సమాచారం రెడ్ క్రాస్ సొసైటీ వారి వద్ద ఉండాలి. బ్లడ్ డొనేట్ చేసిన వారికి ,రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *