సిరాన్యూస్,బేల
బేలలో భారీ వర్షం…
* ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఆయా గ్రామాలలో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పలు ఇళ్లల్లో నీరు చేరుతుంది. ఈ వర్షానికి గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించాయి. నివసించే గృహాల్లోకి భారీగా నీరు రావటంతో కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు.ఈ విషయాన్ని గ్రామపంచాయతీ గమనించి కార్యదర్శి సురేష్ కారోబారి గజానంద్ తో జేసీబీతో లోతట్టు ప్రాంతాల్లో ఆగి ఉన్న నీళ్లను బయటికి తీశారు.