సిరాన్యూస్, సామర్లకోట
వెల్ఫేర్ హాస్టల్స్, అనాథాశ్రమాలను తనిఖీ చేసిన తహసీల్దార్ శ్రీనివాస్
పశ్చిమ గోదావరి జిల్లాలో పెంటపాడు మండలంలో గల ప్రభుత్వ వెల్ఫేర్ హాస్టల్స్, అనాథాశ్రమాలను గురువారం రాత్రి పెంటపాడు మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో బాలాజీ తనిఖీ చేశారు. ఈసందర్బంగా బాలుర బాలికల వెల్ఫేర్ వసతిగృహాలను పరిశీలించారు.వసతి గృహం లోని వంట గదని పరిశీలించారు.నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు. వండిన ఆహారం పైన తప్పనిసరిగా మూతలు ఉంచాలని వసతి గృహ నిర్వహకులకు ఆదేశించారు. నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు.