బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఇద్దరు మహిళా కౌన్సిలర్లు

కోరుట్ల,(సిరా న్యూస్);
కోరుట్ల పట్టణానికి చెందిన
ఇద్దరు బీజేపీ పార్టీ మహిళా కౌన్సిలర్లు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు..
ఈ మేరకు
దాసరి సునీత,
మొలుమూరి అలేఖ్య, గత మున్సిపల్ ఎన్నికల్లో 11, 12 వ వార్డు కౌన్సిలర్లు గా బీజేపీ పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పార్టీ వార్డు అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా కృషి చేస్తూ అధికార పార్టీని ప్రశ్నిస్తూ కొనసాగాము కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ కనీసం ప్రజా ప్రతినిధులను కూడా చూడకుండా చాలా చులకన గా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగేకనీసం వార్డులో కూడా పేరు ఉచ్చరించడానికి ఇష్టపడడం లేదని, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తున్న కార్యకర్తలకు కనీస మర్యాద ఇవ్వడం లేదన్నారు .కావున  పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఇన్ని రోజులు మాకు సహకరించిన కార్యకర్తలకు,
అలేఖ్య, సునీతలు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *