సిరా న్యూస్ చిగురుమామిడి:
ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల 1998-99 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ‘సిల్వర్ జూబ్లీ వేడుకలు’ ఘనంగా కరీంనగర్ లోని ఓ రిసార్ట్ లో ఘనంగా నిర్వహించారు. గతంలో 2020 లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బొమ్మనపల్లి స్కూల్ లో నిర్వహించిన సందర్భంగా స్కూల్ కు వాటర్ ప్యూరిపాయిర్, విద్యార్థుల కు బుక్స్, క్రీడా సామగ్రి, తదితర పరికరాలను పంపిణి చేశారు.చిన్ననాటి మిత్రులు అందరు కలుసుకొని ఆత్మీయ పలకరింపుతో చిన్ననాటి మధుర క్షణాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. 1998-99 బొమ్మనపల్లి లో పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఇప్పటికే ఒక్కరికొకరు పరస్పర సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాడ మహేందర్ రెడ్డి, సతీష్, శ్రీదర్ రెడ్డి,రాజు, బద్దిపడిగే రాజు, కనవెని సతీష్, నిమ్మ శ్రీనివాస్,రమేష్, కొండల్, అర్జున్ గౌడ్, శ్రీనివాస్ కొంకట తదితరులు పాల్గొన్నారు.