సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా కృష్ణకాంత్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో నూతన ఎస్పీగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ కృష్ణ కాంత్ పాటిల్ పాత్రికేయులతోమాట్లాడుతూ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఎస్పీగా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో అవకాశం వచ్చిన నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికలను నిర్వహిస్తా
మన్నారు. కడప, కర్నూలు లాంటి ప్రాంతాల్లో ఏఎస్పీగా పనిచేసిన అనుభవం ఉందని.. ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఎస్పీగా పని చేసే మొదటి అవకాశం రావడం సవాల్ గా తీసుకుని పనిచేస్తానన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు, వీఐపీలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు.