Seizure of cash : నగదు స్వాధీనం

సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, కార్వేటినగరం పోలీసులు వాహన తనిఖీలలో భాగంగా కోటి రూపాయల 9 లక్షల,44 వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్వేటినగరంలో సోమవారం సాయంత్రం పోలీసులు తమ విధులలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్సై వెంకటకృష్ణ, తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా 1 కోటి 9 లక్షల,44 వేల 200 రూపాయల నగదు ను మరియు ఆ నగదును తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.
నగిరి డిఎస్పి పవన్ కుమార్ కార్వేటి నగరం సర్కిల్ సీఐ సత్య బాబు, ఆధ్వర్యంలో తిరుపతి అసిస్టెంట్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కు నగదును పంపిస్తున్నట్లు తెలిపారు. ఆర్కే పేట నుండి పుత్తూరు కు తరలిస్తున్న సుందరం సుధాకర్ నగదును పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *