College annual day: ఘనంగా శ్రీ రాజ రాజేశ్వర కళాశాల వార్షికోత్సవం

సిరాన్యూస్, బజార్ హత్నూర్
ఘనంగా శ్రీ రాజ రాజేశ్వర కళాశాల వార్షికోత్సవం
* అల‌రించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లోని గిర్నూర్ లోని శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమనికి ప్రముఖ జానపద కళాకారుడు రెలరేల చాహకటి రవి బృందం,ప్రముఖ నృత్య కళాకారుడు రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థి వెంకటేష్ బృందం చే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . కళాశాల వార్షికోత్సవం సందర్భంగా దేశానికి అన్నం పెట్టే రైతు ఎట్టం రాజేశ్వర్, దేశానికి కవచముల నిలబడి మన అందరి రక్షంచే రిటైర్డ్ ఆర్మీ జవాను చాటే గణేష్ ల‌ను ఘనంగా సత్కారించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంత‌రం రైతు ఎట్టం రాజేశ్వర్,చాటే గణేష్ మాట్లాడుతూ మాకు అవకాశాన్ని కల్పించిన కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ జానపద కళాకారుడు రవి మాట్లాడుతూ యువతరం అంటే నేలతల్లి లాంటి వాళ్ళురా జాతి భారాన్ని అంత భుజాన మోసేటోళ్ళురా అంటూ పాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు అని ఈ దేశ భవిష్యత్తు యువత పైనే ఉందని తల్లి తండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మీ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా నిలవాలి అలాగే యువత చరవాణి కి బానిస అవుతూ మానసిక వేదన చెందుతూ వారి గమ్యానికి భాటలు వేయడం మర్చిపోతున్నారు అని పాట రూపములో తెలిపారు.ఈ కార్యక్రమం లో విద్యార్థిని విద్యార్థులూ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *