Sayanna: ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌రూర‌ల్‌
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
* ఆదిలాబాద్ డీఆర్‌డీఏ సాయన్న

ఉపాధి హామీ కూలీల వేతనాలు ఏప్రిల్ నుండి 300 కు పెంచడం జరిగిందని, కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ డి ఆర్ డి ఓ సాయన్న కోరారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్‌రూర‌ల్‌ మండల కేంద్రం సమీపంలోని పిప్పలదరి అటవీ ప్రాంతంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయ‌న‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాలు పెరిగినందున కూలీల సంఖ్య మరింత పెంచాలని ఏపీఓ జగ్గధేరావుకు వివరించారు. వేసవికాలంలో వంద రోజులు పని చేసినట్లయితే కూలీలకు 30 వేల రూపాయలు వేతనం గా అన్నారు. గతంలో 100 రోజులు కూలీ పనులు చేసిన వారు సైతం ఏప్రిల్ ఒకటి నుండి నూతనంగా చేపట్టే పనుల్లో పనులు చేసే ఆస్కారం ఉందన్నారు. అన్ని గ్రామాల్లో అధికారులు ఉపాధి హామీ కూలి పనిపై అవగాహన కలిగించాలన్నారు. అటవీ ప్రాంతంలో చేపట్టిన సిసిటి పనులను పరిశీలించారు. ఒక వంద 62 మంది కూలీలు చేపట్టిన పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేష్ టి ఏ మధుకర్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *