సిరా న్యూస్,ఆదిలాబాద్
రెండు తులాలనర బంగారు ఆభరణం అందజేత
* నిజాయితీ చాటుకున్న మున్సిపల్ డ్రైవర్, లేబర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ 46 వాడ కు చెందినటువంటి మహిళ మెడలోని గోల్డ్ చైన్ రెండు తులాల నర బంగారు ఆభరణము అనుకోకుండా చెత్తబుట్టిలో పడేసుకుంది. ఆ చెత్తబుట్టిని మున్సిపల్ స్వచ్ఛభారత వాహనం రావడంతో అందులో చెత్తతో సహా ఆ బంగారు ఆభరణం కూడా మున్సిపల్ బండిలో పడవేసింది. కొంత సమయం తర్వాత మహిళ ఆమె ఆభరణాన్ని వెతకడం ప్రారంభించింది. ఆ విషయాన్ని మున్సిపల్ డ్రైవర్, లేబర్ కు తెలియజేయగా అప్పటికే ఆ వేకిల్ ఫస్ట్ ట్రిపు బంగారు గూడ లో ఖాళీ చేయడం జరిగింది. సదర్ మహిళా డ్రైవర్ శ్యామ్ ను , లేబర్ రమేష్ తో తెలియజేయడంతో డంపింగ్ యార్డ్ కు వెళ్లి వెతకగా బంగారు ఆభరణం లభించింది. బంగారు ఆభరణాన్ని బ్రాహ్మణవాడకు చెందిన సదురు మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దర్శనాల నాగేష్ , డ్రైవర్ల విభాగమ అధ్యక్షుడు జనార్ధన్ డ్రైవర్ రవీందర్ , అడ్డూరిఆశన్న ఆధ్వర్యంలో బంగారు ఆభరణాన్ని సదరు మహిళలకు ఇవ్వడం జరిగింది.