సిరా న్యూస్, చిగురుమామిడి:
హైన దాడిలో లేగదూడ మృతి
– ఆదుకోవాలని బాధిత రైతు వేడుకోలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డి పల్లె పరిదిలోని బొల్లోనిపల్లెకు చెందిన ఏండ్ర శ్రీనివాస్‌కు చెందిన లేగదూడ శనివారం రాత్రి హైన దాడిలో మృతి చెందింది. బాదిత రైతు, స్థానికుల కథనం ప్రకారం లేగదూడ చేన్లో మేత మేస్తున్న సమయంలో హైన దాడి చేసి హతమార్చింది. దీంతో దాదాపు రూ. 25వేల విలువ చేసే లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెల్సుకున్న రైతు శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని, లేగదూడ చుసి లబోదిబోమన్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.