Prabhakar Goud: కరువు కాంగ్రెస్ తెచ్చింది కాదు… కరువు ప్రకృతి విపత్తు

సిరా న్యూస్, చిగురుమామిడి
కరువు కాంగ్రెస్ తెచ్చింది కాదు… కరువు ప్రకృతి విపత్తు
* రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చిన కరువు.కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదని…అది ప్రకృతి ద్వారా ఏర్పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రకృతి ద్వారా ఏర్పడ్డ కరువును రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏర్పడిందని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత వాన కాలంలో సరైన వర్షాలు పడకపోవడం వల్ల నీటి కరువు ఏర్పడిందని, అయినప్పటికీ కరువు నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఐదు సంవత్సరాలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏనాడూ సమస్యలు పట్టించుకోకుండా నేడు రైతుల దీక్ష అంటూ రాజకీయ నాటకానికి తెరలేపారని. గతంలో రాముడు, అక్షింతల పేరుమీద లబ్ధి పొందాలని చూసారని నేడు రైతుల పేరుమీద రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తమ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు మేలు చేయకుండా తప్పుదోవ పట్టించే ఆరు గ్యారంటీల మీద మాట్లాడడం విడ్డూరమన్నారు.తమ ప్రభుత్వాన్ని దమ్ముంటే టచ్ చేయాలని సవాల్ విసిరారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఎవరు ముట్టుకోలేరని హెచ్చరించారు.అయినా బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వాలను కూలగొట్టే అలవాటు ఉందని దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పూలగొట్టిన చరిత్ర బిజెపితోనే అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కరువును తమ ప్రభుత్వం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని, తాము కూడా కరువు కారణం బిఆర్ఎస్ ప్రభుత్వం కాదని అంటున్నామని తెలిపారు.నేటి కరువు నూటికి నూరు శాతం ప్రకృతి విపత్తేనని..రైతాంగానికి మేలు చేయడానికి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలే తప్ప ఇలా రైతులను తప్పుదోవ పట్టించడం పద్ధతి కాదని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి గీకురు రవీందర్, కంది తిరుపతిరెడ్డి, చిట్టిమల్ల రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మాచమల రమణయ్య, మాచమల్ల కిషోర్, మల్లికార్జున్ రెడ్డి, కత్తుల దేవేందర్,మామిడి చంద్రమౌళి, గంప తిరుపతి మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *