షర్మిల దిష్టిబొమ్మ దగ్దం

సిరా న్యూస్,ఏలూరు;
కాంగ్రెస్ పార్టీలో సైతం టికెట్ల రగడ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నిన్న తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో అసమ్మతి సెగ మొదలైంది
దెందులూరు నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డివిఆర్కే చౌదరి తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వసంత మహల్ సమీపంలో ఉన్న భవంతి లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల రెడ్డి కుటుంబంలో జరిగిన వివాదాలను తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నారని అంతేకాకుండా జాతీయ పార్టీని సైతం ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజార్చే విధంగా షర్మిల రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యపెట్టారు. కష్టపడి పనిచేసిన తనకు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని నిరాశతోనే పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. పెదవేగి దెందులూరు పెదపాడు ఏలూరు రూరల్ మండలం సంబంధించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులకు సైతం రాజీనామా చేశారు తను ఏ పార్టీలో చేరిపోయేది నిర్ణయించుకొని తెలియజేస్తారని ఈ సందర్భంగాDvrk తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *