సిరా న్యూస్: ఆదిలాబాద్:
ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బిజెపి అభ్యర్థి పాయల్ శంకర్ కు అభినందనలు వెళ్ళు వెత్తుతున్నాయి. నేడు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులతో సందడిగా మారింది. జైనత్ మండల కేంద్రానికి చెందిన సామ రాకేష్, రమేష్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, మహేందర్ యాదవ్, సందీప్ చౌదరి తదితరులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు బొకేలు అందించి శాలువాతో సన్మానించారు.