సిరాన్యూస్, బేల
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండావార్
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షతులై బేల మండలంలోని భాది గ్రామానికి చెందిన యువ నాయకులు బోనుల వెంకట్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ పలువురు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండావార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా బేల మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండావార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలే కాకుండా నిరుద్యోగ యువతకు 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదీ అని అన్నారు.ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అండతో రాబోయే రోజుల్లో బేల మండలం మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మడావి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సుంకరి శ్రీనివాస్, దంతేలా రాజేష్, మోర్లే దత్తు, షేక్ వజీర్, రుమల కృష్ణా, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.