సిరాన్యూస్, చిగురుమామిడి
బొమ్మనపల్లి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా తాడ వాసుదేవారెడ్డి
µ ఉపాధ్యక్షుడిగా కత్తుల దేవేందర్ యాదవ్ ఎన్నిక
చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా తాడ వాసుదేవ రెడ్డి, ఉపాధ్యక్షుడి గా కత్తుల దేవేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.బుధవారం యూనియన్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు కాసర్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి వినుకొండ శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా గంప రమేష్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ బలోపేతం కోసం అందరిని కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.