Prabhakar Reddy: ఘనంగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సిరా న్యూస్, సైదాపూర్
ఘనంగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సైదాపూర్ మండల కేంద్రంలో బుధ‌వారం రాష్ట్ర ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన జన్మదిన వేడుకలకు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించారు. ఈసంద‌ర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి సైదాపూర్ మండలానికి, వివిధ గ్రామాలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. సైదాపూర్ మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి కృషి ఎంతో ఉందని అన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లు యుగేందర్ రెడ్డి, కాయిత రాములు,కొండ గణేష్, మహిళలు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *