Vemula Ramesh: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లీగల్ అధికార ప్రతినిధి గా వేముల రమేష్

సిరాన్యూస్, సైదాపూర్
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లీగల్ అధికార ప్రతినిధి గా వేముల రమేష్
* రమేష్ కు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లీగల్ అధికార ప్రతినిధి గా వేముల నియమితులయ్యారు. ఆయన‌ను భారీ ర్యాలీతో కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు,సీనియర్ న్యాయవాది , ఉద్యమకారుడు, దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్ టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గా ఎన్నికైన తరువాత వెన్కేపల్లి-సైదాపూర్ మొదటిసారిగా మండల కేంద్రానికి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. వేముల రమేష్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా కోర్టులో న్యాయవాది కొనసాగుతున్నాడు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిలో నియమించిన టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణ శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి గుండారం శ్రీనివాస్, దుద్దెనపల్లి ఎంపీటీసీ చాడ కొండాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి , సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సీపీఐ మండల ఇంచార్జ్ బత్తుల బాబు, సైదాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ దుద్దెనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేశం, హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్, మాచర్ల వెంకటేష్,సోషల్ మీడియా మండల ఇంచార్జ్ తాళ్ళపెల్లి అజయ్, బోనగిరి సందీప్ కుమార్, వేముల సాయి కుమార్, బోనగిరి అనిల్,బండారి శరత్ కుమార్, జవాజి అభిషేక్,ముజ్జిగ రామకృష్ణ, మేదరి శ్రీ రాఘన్, సుంకరి శ్రావణ్, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాదవత్ భాస్కర్ నాయక్, సామాజిక కార్యకర్త మరియు మేధావి వర్గం ఫోరమ్ అధ్యక్షులు కుమార్ రాజా, దుస్స కుమార్, కొరిమి మహేష్, వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు, యూత్ నాయకులు, అభిమానులకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *