సిరా న్యూస్,హైదరాబాద్;
నిన్న తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం ఈరోజు మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు కొన్ని చోట్ల, రేపు మరియు ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 – 50 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 – 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఇక్కడ ఎల్లో అలర్ట్
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో గాలులు (40-50 కి.మీ.) తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 – 10 కిలో మీటర్ల నుంచి వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.7 డిగ్రీలుగా నమోదైంది. 57 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.