Odela: ఇరుకు రోడ్లతో ఇబ్బందులు

సిరాన్యూస్‌, ఓదెల
ఇరుకు రోడ్లతో ఇబ్బందులు
* తక్కువ వెడల్పుతో ఇక్కట్లు

ఓదెల మండల కేంద్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మండలాలు ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు వెడల్పు జరగలేదు. మడక రోడ్డు నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం వైపు పోయే రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్లపై ఎదురెదురుగా వాహనాలు వస్తే రివర్స్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇరుకు రోడ్లతో తరచూ ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మడక రోడ్డు నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామం వరకు రోడ్డు వెడల్పు చేయవలసి ఉండ‌గా, రోడ్డు వెడల్పు కోసం అధికారులు మార్కింగ్ కూడా చేసి వెళ్లారు. కానీ రోడ్డు వెడల్పు ప‌నులు మొద‌లు పెట్ట‌లేదు. పాలన మారింది.. పాలకులు మారారు… కానీ ర‌హ‌దారులు మాత్రం మార‌డం లేదని ప్ర‌యాణికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైన నూత‌న ప్ర‌భుత్వం గ్రామంలోని రోడ్లు వెడల్పు చేసి రవాణా సాకోర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *