సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఖానాపూర్‌లో ఘనంగా భూక్య జాన్సన్ నాయక్ జన్మదిన వేడుకలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్థానికి సాయి బాబా ఆలయంలో బీఆర్ ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖానాపూర్ మండల, పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి చౌక్ వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జన్మదిన వేడుకలు సందర్భంగా పేదవారికి బిర్యానీ అందజేశారు. ఉపాధి కూలీలకు కూల్ డ్రింక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందు ఉండి ప్రజలకు అన్ని విధాల సేవలు అందింస్తున్న జాన్సన్ నాయక్ నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యలతో సుఖ సంతోషాలతో బాగుండాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మండల, పట్టణ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.