Sudhir Kumar Sangem: తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు న్యాయ‌వాది సుధీర్‌కుమార్ సంగెంకు ఆహ్వానం

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు న్యాయ‌వాది సుధీర్‌కుమార్ సంగెంకు ఆహ్వానం
* ఇది జిల్లా ప్రజలకు దక్కిన సగౌరవం

న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం అనే పేరు జిల్లా ప్రజలకు సుపరిచయమే. సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు అత్యున్ననత అవార్డులు ఎన్నో వారికి సొంతమైన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ, సేవా ఫౌండేషన్ సత్య సంగీత ఇంటర్నేషనల్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఈనెల15న ప్రసిద్ధ కళానిలయం హైదరాబాద్ మహానగరంలోని చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ముఖ్య అతిథిగా పాల్గొనే అరుదైన ఆహ్వానం అందింది. ఈఆహ్వానం పట్ల జిల్లా ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తపరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *