సిరాన్యూస్,నేరడిగొండ
జియో కేబుల్ కోసం ఇష్టానుసారంగా గుంతలు
* ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామం ప్రధాన రహదారి గుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా జియో కేబుల్ నెట్వర్క్ కోసం సదరు గుత్తేదారు ఇష్టానికి గుంతలు తీశారు. దీంతో చిన్నపాటి వర్షానికి రోడ్డు కోతకు గురియి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనికి సంబంధించి l పంచాయతీ సెక్రెటరీ ప్రశ్నించగా మా దగ్గర ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా ఈ గుంతలు కావాలని చెప్పుకొచ్చారు. పీఆర్ జె ఈని కూడా అడగగా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఈ గుంతలు చేశారని చెప్పారు. మరి ఈ గుత్తేదారులపై చర్య తీసుకొని గ్రామంలో తీసిన గుంతలు పూడ్చి రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.