గంటలో ఒక హత్య, రెండుహత్యాయత్నాలు

 సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాత బస్తి షా అలీ బండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గంటలోనే ఒక హత్య, రెండు హత్యాయత్నాలు నమోదయ్యాయి.
షా అలీ బండా పోలీస్ స్టేషన్ పరిధిలోనిబస్తీలో రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అదే సమయంలో మరణించిన రఫీక్ బిన్ షిమ్లాన్కు ఖలీద్ స్నేహితుడు. ఒకరు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతకు కొన్ని నిమిషాల క్రితం షా అలీ బండా పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూలాల్ బారాదరి వద్ద గుర్తు తెలియని వ్యక్తిపై ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న షా అలీ బండా, కాలాపత్తర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా క్యాజువాలిటీకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *