పార్టీ నిర్మాణంలో లోపమే కొంప ముంచుతుందా…

సిరా న్యూస్;

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ప్రతిపక్షానికే పరిమితమైన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి కారణాలు, దారులు వెతుక్కుంటారు. గతంలో అధికారం అనుభవించిన పార్టీలను తిట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల్లోకి జంప్ అయిపోతారు. వైసీపీ, బీఆర్ఎస్ విషయంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఒకరిద్దరు సహజంగా పార్టీలు మారుతారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే పార్టీని వీడారు. మిగిలిన వారంతా కేసీఆర్ తోనే ఉన్నారు.ఇక వైసీపీ విషయానికి వచ్చినట్టు అయితే.. ఇంకా ఫిరాయింపులు మొదలుకాలేదు. అంటే.. పరిస్థితులు మరీ చేతులు దాటిపోయేలా లేవు. కానీ.. బీఆర్ఎస్, వైసీపీ భవిష్యత్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం పార్టీ ఫిరాయింపులో, నేతలు కండువాలు మార్చేస్తారనో కాదు. ఆ పార్టీల అధినేతలు పార్టీ నిర్మాణం విషయంలో చేసిన పొరపాట్లు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పార్టీ బలంగా ఉండేలా కేసీఆర్, జగన్ పార్టీలను నిర్మించలేదు. కేవలం అధికారంలో ఉన్నపుడు హంగులు మాత్రమే అద్దారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆ హంగులన్ని రాలిపోతున్నాయి.తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులను పార్టీలో చేర్చుకుంది. 2014 కంటే ముందు కొన్ని జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం బలం లేదు. అలాంటి దగ్గర టీడీపీ నేతలతో ఆ గ్యాప్ నింపుకుంది. అంటే ఇతర పార్టీ నాయకులను తమలో కలుపుకుందే తప్పా.. సొంతగా పార్టీ క్యాడర్ ను తయారు చేసుకోలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ నేతలు కూడా కేసీఆర్ తో కలిశారు. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్లంతా పక్కచూపులు చూస్తున్నారు. ఇక ఏపీలో వైసీపీ విషయానికి వచ్చినట్టు అయితే.. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలకు వైసీపీ ఓ వేదికగా కనిపించింది. జగన్ కూడా ఇదే మంచి అవకాశంగా భావించి వచ్చినవారికి వైసీపీ కండువా కప్పేశారు. పార్టీ నిర్మాణం అయిపోయిందని అనుకున్నారే తప్పా.. ఇదే భవిష్యత్‌లో తనకు ప్రమాదంగా మారుతందని అంచనా వేయలేదు. రేపటి రోజున ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని కొంచెం నమ్మకం కలిగినా.. వైసీపీ నేతలంతా హస్తం గూటికి చేరిపోవడం ఖాయం. ఇప్పుటికే అదే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. ఇక టీడీపీ విషయానికి వచ్చినట్టు అయితే.. వైసీపీ, బీఆర్ఎస్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది. టీడీపీని చంద్రబాబు బలంగా నిర్మించారు. అందుకే.. 70శాతానికి మించి టీడీపీ ఎమ్మెల్యేల రాజకీయ ప్రస్థానం ఆ పార్టీ నుంచి మొదలవుతుంది.అంటే.. టీడీపీ స్కూల్‌ల్లోనే వాళ్లు ఓనమాలు దిద్దారు. అలాంటి వారు ఒకరిద్దరు పార్టీని వీడి వెళ్లిపోయినా.. మెజారిటీ నేతలు ఉంటారు. అందుకే.. 2004, 2009లో ఓడిపోయినా మళ్లీ 2014లో టీడీపీ గెలిచింది. 2019లో ఓడిపోయినా 2024లో మళ్లీ గెలిచింది. ఎందుకంటే సహజంగానే ప్రాంతీయ పార్టీల్లో నాయకుడే సర్వస్వంగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వైఎస్ జగన్ అనే నాయకుడే ఆ పార్టీకి జెండా, ఎజెండా అన్నట్టుగా ప్రజల్లో ప్రచారం కూడా సాగుతుందిసామాన్య జనం కూడా జగన్‌ని గమనంలో ఉంచుకుని మాత్రమే ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓట్లు వేసిన సంగతిని అంతా అంగీకరిస్తారు. వైసీపీ నాయకులు కూడా జగన్‌ను జనం ఆదరించడం వల్లనే తాము గెలిచామని పలు సందర్భాల్లో చెప్పడం గమనార్హం. ‘‘ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించలేకపోతున్నాయి. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వం, పార్టీ రెండు కన్నుల్లా ఉండేవి. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితమయ్యారు.ఇలాంటి సమయంలో పార్టీ నిర్మాణం మీద, కార్యకలాపాల మీద దృష్టి కనిపించడం లేదు. ఎన్టీఆర్ మాదిరిగానే జగన్‌కు కూడా సొంత ఛరిష్మా ద్వారా అధికారం దక్కినా ఎన్టీఆర్ తరహాలో ఓ యంత్రాంగాన్ని జగన్ సిద్ధం చేసుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు.ముగ్గురు, నలుగురు మినహా పాలన, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే వారే కనిపించని స్థితి తెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.కరోనా సహా వివిధ కారణాలతో గడిచిన మూడేళ్లుగా స్థానిక ఎన్నికలు మినహా పార్టీల రాజకీయ కార్యాచరణ పెద్దగా కనిపించలేదు. తాజాగా ఇటీవల నియోజకవర్గ ప్లీనరీలు, జిల్లా స్థాయి ప్లీనరీలతో సమావేశాలు నిర్వహించారు.ఆయా సమావేశాల్లో పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తల సమస్యల గురించి వాపోవాల్సి వచ్చింది.పార్టీ నిబంధనావళిలో కూడా కొన్ని మార్పులకు సిద్ధమయ్యారు.కింజరాపు ఫ్యామిలీ, విజయనగరం రాజులు లాంటి వారు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బచ్చయ్య చౌదరి ఇలాంటి వారంతా టీడీపీలోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అందుకే అంత ఈజీగా పార్టీ మారరు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎన్ని ప్రలోభాలు ఎదురైనా టీడీపీతోనే ఉంటారు. ఎందుకంటే వారి పుట్టుక అక్కడే మొదలైంది. పార్టీ నిర్మాణం బలంగా ఉంటే.. నేతలు అంటిపెట్టుకొని ఉంటారు. కానీ, బీఆర్ఎస్, వైసీపీ మాత్రం ఇతర పార్టీల నుంచి నాయకులను ఇంపోర్టు చేసుకుంది. అధికారం కోసం వచ్చిన నేతలు.. అధికారం పోతే వెళ్లిపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *