MLA Payal Shankar: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్, జైన‌థ్‌
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడిఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి ఆపదలో అండగా నిలిచారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం బేలకు వెళ్తుండగా జైనథ్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి స్వయంగా 108 వాహన సిబ్బందికి ఫోన్ చేసి, బాధితున్ని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *