డీఎస్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

 సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ మంత్రి,ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి గా ,పిసిసి చీఫ్ గా చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *