సిరాన్యూస్, జన్నారం
కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కమాన్ పల్లి గ్రామంలో 3 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుండీ ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూపాయి 500 గ్యాస్, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల భీమా,రైతు బంధు, లాంటి పథకాలను అమలు చేస్తామన్నారు. త్వరలో 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు.విద్య, వ్యవసాయం, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు తదితరులు పాల్గోన్నారు.