స్థలం కేటాయించిన నిధులు ఇవ్వని ప్రభుత్వం
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం కరువైంది దశాబ్దాల తరబడి స్థానికంగా ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం ఉంది సర్కిల్ పరిధిలో సుమారు ఏడు మండలాలు ఉన్నాయి సర్కిల్ కార్యాలయం మొదట్లో స్థానిక అశోక్ నగర్ లోని ఒక అద్దె భవనంలో ఉండేది అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటి యజమాని ఖాళీ చేయమని చెప్పడంతో పట్టణంలోని మరో బాడుగ ఇంట్లోకి కార్యాలయాన్ని తరలించారు అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత కాళీ చేయవలసి వచ్చింది ఆ తరువాత స్థానిక సిద్ధవటం రోడ్ లోని తెలుగు గంగ కాలనీకి వెళ్లే దారిలో మరో అద్దె భవనంలో కార్యాలయాన్ని తరలించారు అక్కడ దాదాపు18 సంవత్సరాల పాటు కొనసాగింది తర్వాత ఆ ఇంటి యజమాని కూడా కాళీ చేయమని చెప్పడంతో అదే రోడ్డులోని మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఉన్న భవనంలోకి కార్యాలయాన్ని తరలించారు కార్యాలయం తరలించిన కొద్ది రోజుల్లోనే అప్పటి మహిళ సీఐ హిమబిందు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఆ తరువాత వచ్చిన సిఐ కూడా ఇదే తరహాలో వ్యవహరించి సస్పెండ్ కు గురయ్యారు దాంతో మార్పు చేసిన కార్యాలయం అచ్చి రాలేదని ఆ తర్వాత వచ్చిన అధికారులు పూజలు చేసి వినాయక విగ్రహాన్ని కార్యాలయం ముందు భాగంలో ఉంచారు ఆ విగ్రహం ఇప్పటికీ కార్యాలయం ముందు భాగంలో ఉంది ఎక్సైజ్ కార్యాలయం కోసం సిబ్బంది నివాస గృహాల కోసం స్థానిక బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయం
పక్కనే దాదాపు రెండు దశాబ్దుల క్రితం స్థలం కేటాయించారు కానీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు దీంతో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం అద్దె భవనాలకే పరిమితమైంది కేటాయించే స్థలంలో పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని స్థానిక అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు కానీ నిధులు మాత్రం మంజూరు కాలేదు దీంతో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం అద్దె భవనాలకే పరిమితమైంది మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి మంచి రాబడి వస్తుంది రాబడి తెచ్చే కార్యాలయానికి సొంతగూడు లేకపోవడం విచారకరం