Bela Muharram: బేలలో కొనసాగుతున్న మొహర్రం ఉత్సవాలు

సిరా న్యూస్, బేల‌
బేలలో కొనసాగుతున్న మొహర్రం ఉత్సవాలు

ఆదిలాబాద్ జిల్లా బేల మండల వ్యాప్తంగా మొహర్రం వేడుకలు మంగళవారం ఘనంగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా హుసేన్ హుసేన్ దేవస్థానం బంగ్లాల వద్ద సందడి నెలకొంది. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో హజరత్ ఆలీ బాబా సవారి బంగ్లా వద్ద వేడుకలను ఘనంగా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పీరీలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సవారీలను ఊరేగించారు. మరోవైపు వర్షం నేపథ్యంలో సవారిలు తడవకుండా కవర్లను ఏర్పాటు చేశారు. భ‌క్తులు హరీష్, నవీన్, తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *