సిరా న్యూస్,ఇచ్చోడ
రోడ్డుకు మరమ్మతులు చేయాలి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అదిలాబాద్ బైపాస్ నుండి నిర్మల్ బైపాస్ వరకు రూ 13 కోట్లలో చేపట్టిన రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వర్షాకాలం నేపథ్యంలో రోడ్డుపై కంకర తేలి గుంతలు, ఏర్పడ్డాయని దీంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు, గుత్తేదారు స్పందించి కంకర తేలిన రోడ్డుపై గుంతలను పూడ్చాలని కోరారు.