సిరాన్యూస్, ఖానాపూర్
రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి :కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బాణావత్ గోవింద నాయక్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో అన్నదాతల ఆనందంలో మునిగి తెలరన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే హేళన చేసిన బీఆర్ఎస్ నేతలు, ఆగస్టు 15లోగా రుణమాఫీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.ఎక్కడ ఎప్పుడు లేని విదంగా దేశంలో నే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే రోజు 7000 కోట్లు 11లక్షల 50 వేల మంది రైతులకు లక్ష 50 వేల రుణంమాఫీ చేసి ఆ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారని తెలియజేశారు. ఈసందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.