సిరాన్యూస్, ఖానాపూర్
శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్లో ఉచిత వైద్యం: డాక్టర్ కె. కార్తీక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు విజయలక్ష్మి హాస్పిటల్ యజమాన్యం, డాక్టర్ కె. కార్తీక్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబిబిఎస్, ఎండి,(ఉక్రెయిన్) జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. కార్తీక్ మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ ,కడెం , దస్తురాబాద్ ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్యం ఆగస్టు 1 నుండి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఉచితముగా ఔట్ పేషెంట్లు, బీపీ చెక్ అప్, షుగర్ టెస్ట్, ఈసీజీ, పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అవసరం ఉన్న పేషెంట్లకు ప్రతి రక్త, మూత్ర పరీక్షలలో 20శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు, శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్. సెల్ నెంబర్.9705037033 , 727468719. నంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.