గాలి వల్ల మంకీ ఫాక్స్ వ్యాపించదు

గాంధీ వైద్యులు
సిరా న్యూస్,సికింద్రాబాద్;
మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు. కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకిన వారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజకుమారి తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా మంకీ ఫాక్స్ (ఎం ఫాక్స్) అలజడి సృష్టిస్తున్న నేపద్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10పురుషులకు, 10మహిళలకు చొప్పున మొత్తం 20పడకలను కేటాయించారు. ఈ సందర్బంగా డా. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంకీ ఫాక్స్ లక్షణాలతో వచ్చిన వారిని సాధారణ రోగులతో కలువనీయకుండా డైరెక్టుగా సంబంధిత వార్డుల వద్దకే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. చికిత్సకు అవసరమైన మందులను, ఆంటీ వైరల్ డ్రగ్స్ సేకరించడానికి ఆదేశించామని అన్నారు. ఇప్పటివరకైతే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు.

జనరల్ మెడిసిన్ ప్రదానదిపతి డా. సునీల్ మాట్లాడుతూ చికెన్ ఫాక్స్ మాదిరిగానే వీటి లక్షణాలు రాశాస్, నీటి బుడగలు, జ్వరం, వళ్ళు నొప్పులు వస్తాయని తెలిపారు. చికెన్ ఫాక్స్ లో కంటే ఇందులో ఎక్కువగా ర్యాషెస్ నీటి పొక్కులు వస్తాయని పేర్కొన్నారు. ప్రారంభం దశలో గుర్తిస్తే ఇతరులతో కలవనివ్వకుండ ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించవచ్చని తెలిపారు. తీవ్రంగా ఉంటే హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకొని చికిత్స అందించాల్సిందేనని అన్నారు. మన దగ్గర ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదని, యురాఫ్, ఆఫ్రికా దేశాల్లో దీని ప్రభావం ఉందని చెప్పారు. ముఖ్యంగా ఇటీవల అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర ఉన్న వారితో దూరంగా ఉండాడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండాలని కోరారు. మంకీ ఫాక్స్ టీకాలు తీసుకున్న వారికి అంత త్వరగా సోకే అవకాశం లేదని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్దులకు, ఇతర రోగ గ్రస్తులకు సోకే అవకాశం ఉంటుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *