సిరాన్యూస్, ఉట్నూర్
మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు చేసిన సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఉట్నూర్లో మాజీ మంత్రి కోట్నాక్ భీంరావ్ వర్ధంతి
* నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
గిరిజనుల అభివృద్ధికి మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు ఎనలేని కృషి చేశారని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి కోట్నాక్ భీంరావ్ వర్ధంతి పురస్కరించుకొని అయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గిరిజన శాఖ మంత్రిగా కోట్నాక్ భీంరావు ఎన్నికై ఆదివాసీ-గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు.విద్యా అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయన చేసిన సేవలు మరవలేనివన్నారు.ఈ ప్రాంతంలో ఐటీడీఎ తో పాటు గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి అయన ఎంతో కృషి చేశారన్నారు.33ఏళ్ళ తర్వాత అయన స్ఫూర్తితోనే తాను అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేశానని, ఈ ప్రాంత ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఎ పిఓ ఖుష్బు గుప్తా, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి,రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి,రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి, జిల్లా సార్మేడి దుర్గు,కోట్నాక్ భీంరావు తనయుడు రమేష్,అధికారులు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు,ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.