సిరా న్యూస్,సామర్లకోట
పంట నష్టం పై అంచనాలు త్వరగా అందించాలి: ఎమ్మెల్యే చిన్నరాజప్ప
వరద కారణంగా నష్టం వాటిల్లిన వరిపంట నష్టం అంచనాలు త్వరగా అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఏలేరు వరద కారణంగా ముంపు బారిన పడిన పంట పొలాలను సామర్లకోట మండలం పవర గ్రామంలో, పెద్దాపురం మండలం కట్టమురు గ్రామంలోనూ శుక్రవారం ఎమ్మెల్యే చిన్నరాజప్ప పరిశీలించారు. ఈసందర్బంగా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వరద ప్రవాహంతో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై అంచనా వేశారు. కట్టామురు గ్రామంలో నడిచేందుకు వీలు లేకపోవడంతో ట్రాక్టర్ పై ఎక్కి ఎమ్మెల్యే పొలాలను పరిశీలించారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి పంట నష్టం పై సమీక్షించారు. అలాగే రైతులకు, అధికారులకు ఆయన పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆయా గ్రామలకు చెందిన రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.