సిరాన్యూస్, ఆదిలాబాద్
గోలి శంకర్ పాడే మోసిన మాజీ మంత్రి జోగు రామన్న
* శంకర్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోలి శంకర్ మరణం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఆయన అంత్యక్రియలను కాలనీవాసులు గౌరవప్రదంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అంతిమ శోభాయాత్రలో కాలనీ వాసులతో కలిసి పాల్గొన్నారు. వారి భుజాలపై పాడే మోస్తూ శోభాయాత్రను కొనసాగించారు. అలాగే బి ఆర్ఎస్ పార్టీ జెండాను పార్థ దేహం పై పరిచి నినాదాలతో హోరెత్తించారు. గోలి శంకర్ అమర్ హై అంటూ లాంఛంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.