సిరాన్యూస్,జైనథ్
అక్రమ గోమాతల తరలింపులను నియంత్రించాలి: భజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షుడు సంతోష్
అక్రమ గోమాతల తరలింపులను నియంత్రించాలని భజరంగ్ దళ్ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ. పురుషోత్తంకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా భజరంగ్ దళ్ అద్యక్షుడు సంతోష్ మాట్లాడారు. జైనథ్, బేల మండలాల నుండి వందల సంఖ్యలో అక్రమంగా గోమాతను పశు వదశాలలకు తరలిస్తున్నార న్నారు. హిందువులు, వ్యవసాయ దారులు పవిత్రంగా పూజించే గోమాతను వదించడం చాలా బాధాకరమని తెలిపారు. వ్యవసాయ దారులు గోమాతను తమ ఇంట్లో మనిషిగా భావిస్తారని, వ్యవసాయ రంగంలో గోవులది అమోఘమైన పాత్ర, అలాగే హిందువులు ఏ పవిత్ర కార్యం నిర్వహించిన అది గోవులతో కచ్చితంగా బందం ఉంటుందని తెలిపారు.ఇకమీదట అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, వ్యవసాయ రంగాన్ని,కాపాడాలని హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో భజ్ రంగ్ దళ్ సభ్యులు గోపాల్, గణేష్ ఉన్నారు.